Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారిపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి ముంబైకే చెందిన బిజినెస్ పర్సన్ దీపక్ కొఠారిని రూ.60 కోట్ల వరకు మోసం చేశారనే కేసు గతంలోనే నమోదైంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. శిల్పాశెట్టి దంపతుల ట్రాలెవ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ ఆడిటర్ ను పోలీసులు విచారించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు శిల్పాశెట్టి దంపతులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Read Also : Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
దీంతో దేశం విడిచి వీరు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు. ఈ కేసు ఆగస్టు 14న నమోదైంది. అప్పటి నుంచి వరుసగా శిల్పాశెట్టి దంపతులు విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో వారు ఎక్కడకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందుకే వారి ట్రావెల్ హిస్టరీని తెలుసుకుంటున్నారు. చూస్తుంటే త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Read Also : Nagachaithanya : ఆమె సలహాలు పాటిస్తా.. నాగచైతన్య ఇలా అన్నాడేంటి