నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు చైతూ ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం మొదలైంది. తెలుగమ్మాయి అయినటువంటి శోభిత ధూళిపాలతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నారనే.. న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా సమంత చేయించిన పుకార్లేనని.. జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సమంతపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
దాంతో దీనిపై గట్టిగానే స్పందించింది సమంత. ‘ఒక అమ్మాయి పై రూమర్స్ వస్తే.. అది నిజమే.. కానీ ఒక అబ్బాయి మీద పుకార్లు వస్తే మాత్రం.. ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు. ఇంకెన్ని రోజులు అలాగే ఉంటారు. ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ప్రస్తావించిన వ్యక్తులు.. దాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళుతున్నారు. మీరూ మర్చిపోయి.. ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద.. ఫ్యామిలీ మీద మీద దృష్టి పెట్టండి.. అని సమంత ట్వీట్ చేసింది. అయితే సమంత ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. చై-సామ్ ఫ్యాన్స్ మాత్రం అదే పనిగా ట్రోల్ చేసుకుంటున్నారు. అసలు చైతూ పై వస్తున్న పుకార్లలో నిజమేంటో తెలియదు గానీ.. సమంతనే స్వయంగా రంగంలోకి దిగడంతో.. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అయినా సమంత అంతలా రియాక్ట్ అయిందంటే.. అసలు మ్యాటర్ వేరే ఉందనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా చై-సామ్ గొడవకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదనే చెప్పాలి.