స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చింది. మొదటి రోజే 21కిలోమీటర్లు తొక్కాను. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సమంత.. ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ‘శాకుంతలం’ విడుదలకు సిద్దం అవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలోను విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన్ మరియు విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది.