టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకపక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక విడాకుల తరువాత నుంచి తానేంటో అందరికి చూపిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ లా మారుతూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ బ్యాగ్ కు అంబాసిడర్ గా మారిన సామ్ ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారింది. బుర్బెర్రీ దుస్తులు మరియు యాక్సెసరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.. ఇక తాజాగా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ అమ్మడు రెచ్చిపోయింది.
బికినీ టాప్ లో సామ్ హాట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ముఖ్యంగా సామ్ టోన్డ్ బాడీ కవ్విస్తోంది.. ఈ ఫోటో చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటివి చేయడానికే విడాకులు తీసుకున్నావా..? అని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా విడాకుల తరువాత సామ్ కొంచెం హద్దు మీరినట్లే కనిపిస్తోందని మరికొందరి వాదన.. ఇకపోతే ప్రస్తుతం సామ్ యశోద, శాకుంతలం చిత్రాలతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.