Khushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషీ. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఖుషీ నుంచి మరో సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లవ్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా లవ్ లో ఉండే పెయిన్ ను తెలియజేసే సాంగ్ ను రిలీజ్ చేసింది.
Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత
“ఎదకు ఒక గాయం..వదలమంది ప్రాణం ..చెలిమివిడి బంధం..ఎవరు ఇక సొంతం..కలతపడి హృదయం.. కరగమంది మౌనం..గతమువిడి పాశం..ఏది ఇక బంధం” అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరు లవర్స్ విడిపోయాక.. వారి పడే విరహవేదనను ఈ సాంగ్ తెలియజేస్తోంది. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించడం విశేషం. ఇప్పటికే నా రోజా నువ్వే సాంగ్ కు కూడా శివనే సంగీతం అందించిన విషయం తెల్సిందే. ఇక ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ తన అద్భుతమైన గొంతుతో ఆలపించాడు. ఈ సాంగ్ విన్నాక బ్రేకప్ లవర్స్ లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక వీడియో లో విజయ్ చూపించిన భావోద్వేగాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విజయ్- సమంత ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.