Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ .. ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం సామ్.. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఇక సామ్ పెట్టిన ఏడాది గ్యాప్ ఇంకా పూర్తీ కాకముందే.. అమ్మడికి ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫోకస్ అంతా టైగర్ 3 మీదనే ఉంది. ఈ సినిమా తరువాత సల్లు భాయ్.. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు.
Madhavi Latha: కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..
ఇక బాలీవుడ్ టాక్ ను బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, క్యాస్టింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో సల్లు భాయ్ సరసన సమంత హీరోయిన్ బావుంటుందని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించడం జరిగిందట. అయితే ఏ ప్రాజెక్ట్ ను సామ్ హోల్డ్ లో పెట్టిందని తెలుస్తోంది. ఈ ఏడాది బ్రేక్ తరువాత అమ్మడు ఈ సినిమాను చేతసాను అని చెప్తుందా.. ? లేక వదిలేస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. సామ్.. బాలీవుడ్ ఎదుగుదలకు ఈ ఆఫర్ మంచిది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి అమ్మడు ఈ ఆఫర్ ను ఒప్పుకుంటుందా.. ? వద్దనుకుంటుందా..? అనేది చూడాలి.