Madhavi Latha: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి మాధవీలత. అచ్చతెలుగమ్మాయి గా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. ఇక ఆ తరువాత సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ప్రస్తుతం మాధవీలత సినిమాలు చేయడం మానేసి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా మారింది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. నెగెటివ్ కామెంట్స్ ఇచ్చినవారిపై ఫైర్ అవుతూ కనిపిస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా మాధవీలత పెళ్లి టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఏ వీడియో పెట్టినా.. అందరు పెళ్లెప్పుడు అని అడిగేవారు ఎక్కువ అయ్యారు. తాజాగా తన పెళ్లిపై ఒక నెటిజన్ ఘాటుగా మాట్లాడేసరికి అమ్మడు కూడా మరింత ఘాటుగా జవాబిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మాట్లాడింది. పెళ్లిపెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అంటున్నాడు.. అందుకే వాడికి సమాధానం చెప్తున్నా అంటూ వీడియో మొదలుపెట్టింది.
Abhishek Nama: బ్రేకింగ్: దేవరకొండ వివాదం ముగియకుండానే మరోసారి అడ్డంగా దొరికిన నిర్మాత
“మీరందరు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి.. అయితే మీరు నాకు పెళ్లి చేయండి.. పెళ్లి చేయండి నాకు.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారా.. ? మోడీ, యోగి, వివేకానంద, అబ్దుల్ కలామ్ వీరెవ్వరు పెళ్లి చేసుకోలేదు.. అయినా భూమి మీద బతకలేదా.. ? పెళ్లి చేసుకోకపోతే అదో పెద్ద నేరమా.. ? పెళ్లి చేసుకోకపోతే సిగ్గుసేరం లేనట్టు.. ఇప్పుడు.. పెళ్లి చేసుకోకపోతే కొవ్వుపట్టినట్టు.. బలుపు ఎక్కినట్లు.. అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నట్లు.. లైఫ్ మీద క్లారిటీ లేనట్లు.. అందుకే పెళ్లి చేసుకొన్నట్లు చెప్తున్నారు. పోనీ పెళ్లి చేసుకొంటే.. వద్దురా నాయనా.. అని మొగుడు పెళ్ళాన్ని అనడం .. పెళ్ళాం మొగుడు ను అనడం.. పెళ్లి చేసుకోనోళ్లు పచ్చి తిరుగుబోతులు అన్నట్లు చెప్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.