ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది కానీ బీటౌన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ కావడం లేదు సమంత. అయితే ఛాన్సులు లేకే ఓటీటీకి పరిమితమైందన్న టాక్ వచ్చింది. కానీ కావాలనే సమంత ఆఫర్లను వదులుకుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని బయటపెట్టింది లేడీ ఫిల్మ్ మేకర్ సుధా కొంగర. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేసింది.
Also Read : Retro : ప్రీ రిలిజ్ వేడుకలో నెక్స్ట్ సినిమాను ప్రకటించిన సూర్య
నవరస వెబ్ సిరీస్ కోసం ఫస్ట్ సమంతకు కాల్ చేశానని, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ వల్ల తను యాక్సెప్ట్ చేయలేదని వెల్లడించింది సుధా కొంగర. అలాగే ఆకాశమేనీ హద్దురా హిందీ రీమేక్ సర్ఫిరాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఛాయిస్ ఆమెనే అనుకున్నానని, అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పింది. టూ టైమ్స్ కాదన్న కూడా భవిష్యత్తులో తనతో వర్క్ చేస్తాననంటోంది సమంత. అయితే తనతో యాక్షన్ సినిమాలు చేయాలని సమంత కోరడం విశేషం. ప్రజెంట్ సమంత రక్త బ్రహ్మాండ్ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తోంది. నిర్మాతగా మారి శుభం అనే మూవీని తెరకెక్కిస్తోంది. మే 9న రిలీజ్ కాబోతుంది శుభం. ప్రజెంట్ ప్రమోషన్లలో టీంతో పాల్గొంటోంది సమంత. ఇవే కాదు తెలుగులో మా ఇంటి బంగారం గత ఏడాది ఎనౌన్స్ చేసింది. ఎంత వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిందో అప్డేట్ లేదు. ఏప్రిల్ 28న బర్త్ డే జరుపుకుంటున్న సమంత నయా ప్రాజెక్టులు మా ఇంటి బంగారం అప్డేట్ పంచుకుంటుందేమో చూడాలి.