Samajavaragamana: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సామజవరాగమన. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నరేష్- శ్రీ విష్ణు కామెడీ, వెన్నెల కిషోర్ కులపిచ్చి.. ఇలా సినిమా అంతా నవ్వులు పూయించేశాడు డైరెక్టర్. ప్రేమించిన అమ్మాయి.. చెల్లెలు వరుస కావడంతో ఆ హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక ఈ సినిమా ఈ నెలలోనే ఓటిటీ లో అడుగుపెట్టింది. ఇక ఇక్కడ కూడా అదే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఆహా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై మేకర్స్ మరింత హైప్ ను పెంచేస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాలోని డిలేటెడ్ సీన్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న కుల పిచ్చి వెన్నెల కిషోర్ సీన్స్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో డిలేటెడ్ సీన్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ డిలేటెడ్ సీన్స్ కూడా నవ్వులు పూయిస్తున్నాయి. నిడివి ఎక్కువ ఉండడం వలన ఈ సీన్స్ కు కత్తెర పడినట్లు తెలుస్తోంది. తాజాగా నరేష్- శ్రీవిష్ణు మధ్య జరిగిన ఒక కామెడీ సీన్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్ వద్ద.. హీరోను.. నరేష్ ఇరికించడంతో కోపం వచ్చిన హీరో.. తన తండ్రిని.. తల్లి దగ్గర ఇరికిస్తాడు. తండ్రి.. ఫిజిక్స్ లెక్చరర్ తో మాట్లాడుతున్నాడని చెప్పడంతో తల్లి.. బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు కదా అని అడుగుతుంది. దానికి నరేష్ బోర్ కొట్టి కాస్త ఫిజిక్స్ ట్రై చేద్దామని చెప్తాడు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ సీన్ కనుక థియేటర్ లో ఉంటే మారుమ్రోగిపోయేదంతే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.