Prabhas: ప్రభాస్ నీ రాక కోసం ‘సలార్’ ఎదురుచూస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచలనంగా నిలిచింది. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి… రాజమౌళి సరసన చేరిపోయాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడికి పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ప్రస్తుతం సలార్ సినిమా మాత్రం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి… మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకి వెళ్లాడు ప్రభాస్.
Read Also: Skanda 2: సీక్వెల్ కి సిద్ధం… బోయపాటి మాస్ ఇది
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఇప్పటికే మోకాలికి సంబంధించిన సర్జరీ అయిపోయింది. ప్రస్తుతం డార్లింగ్ రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత నవంబర్‌లో ఇండియాకు తిరిగి రానున్నాడని తెలుస్తోంది. తిరిగొచ్చిన తర్వాత కల్కి 2898 ఏడీ , మారుతి సినిమా షూటింగ్లో జాయిన్ అవనున్నాడట. అలాగే సలార్ ప్యాచ్ వర్క్ కూడా ఉందని తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ షూట్ కూడా ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే… ప్రభాస్ తిరిగి రాగానే ఫస్ట్ సలార్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు. అందుకే సలార్‌ను డిసెంబర్ 22న సలార్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి నవంబర్‌లో డార్లింగ్ ఇండియాలో అడుగు పెడితే.. షూటింగ్‌తో పాటు సలార్ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడు. మరి ప్రభాస్ ఎప్పుడు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతాడో చూడాలి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..