రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కి రుచి చూపించేలా చేసాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సలార్ సీజ్ ఫైర్ సినిమా చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. మొదటి వారంలోనే 500 కోట్ల మార్క్ ని చేరుకున్న సలార్ సినిమా, సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచు ఆకుపెన్సీని మైంటైన్ చేస్తోంది.
నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్స్, నార్త్ ఇండియాలో వంద కోట్ల కలెక్షన్స్, తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల కలెక్షన్స్, ఆస్ట్రేలియాలో 1.5 మిలియన్ డాలర్స్… ఇలా ప్రతి సెంటర్ లో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది సలార్ సీజ్ ఫైర్. 600 కోట్లకి చేరువలో ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 345 కోట్ల ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ జరుపుకుంది అంటే 347 కోట్ల రూపాయలు షేర్ వస్తే సలార్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారం సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలి అంటే మరో 60 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి సినిమాల సందడి మొదలవ్వడానికి ఇంకా 12 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు సలార్ సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ ని ఏ మేరకు ఫుల్ చేస్తుంది అనే దానిపైన సలార్ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది.