ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడు” అంటూ న్యూస్ వినిపించింది. మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ కొడుకు దేవా… దేవానే ఇలా ఉంటే ఇక సలార్ వస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ హైప్ పెంచారు. ఈ విషయంలో డిసెంబర్ 22న క్లారిటీ వస్తుంది అనుకుంటే రిలీజ్ కన్నా ముందే ఇద్దరూ ఒకడే అని రివీల్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
సలార్ సినిమాలో సలార్, దేవా వేరు వేరు కాదు ఇద్దరూ ఒకడే అంటూ ప్రశాంత్ నీల్ రివీల్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో రిలీజ్ ముందే రివీల్ చేసేసావ్ ఏంటి మావా అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ పరంగా ప్రభాస్ రెండు వెరియేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఒకటి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకొకటి ప్రెజెంట్ రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. తండ్రి కొడుకులు కూడా ఉంటారా లేక ఒక క్యారెక్టర్ తోనే ప్రభాస్ రెండు పార్ట్స్ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఒకడైన ఇద్దరైనా బాక్సాఫీస్ దాగ్గర డిసెంబర్ 22న సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టడం అయితే గ్యారెంటీ.