‘కేజీఎఫ్: చాప్టర్2’ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ సముద్రంలో ముగించిన విషయం తెలిసిందే! నిజానికి.. రాకీ భాయ్ అంత పెద్ద షిప్ వేసుకొని దూసుకెళ్ళడాన్ని చూసినప్పుడు, ఏదో పెద్ద యాక్షన్ సీక్వెన్సే ప్లాన్ చేసినట్టు ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా రాకీ భాయ్‌పై బాంబుల వర్షం కురిపించి, అతను మునిగిపోయే సీన్‌తో ప్రశాంత్ నీల్ ముగించాడు. ఆశించిన యాక్షన్ సీన్ లేకపోవడంతో, ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే.. సలార్‌లో అలాంటి డిజప్పాయింట్మెంట్ ఉండదని తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
సలార్ క్లైమాక్స్‌ను మొత్తం సముద్రంలోనే ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడట! సముద్రంలో బాంబుల వర్షం కురిపించడమే కాకుండా, లోపల ఓ అద్భుతమైన ఛేజింగ్ సీన్ కూడా ఉందని అంటున్నారు. ఇది హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌కి ఉన్న పాన్ ఇండియా స్టార్డమ్, కేజీఎఫ్ సిరీస్‌తో తాను జాతీయంగా క్రేజీ దర్శకుడిగా అవతరించడంతో.. ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ఈ క్లైమాక్స్‌ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారట! ఇంతవరకూ సముద్రంలో యాక్షన్ సీన్లను మన ఇండియన్ సినిమాలో ఎవరూ పెట్టలేదు. మరి, ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడో చూడాలి.
కాగా.. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఈమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. హోంబలే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.