Salaar breaks Jawan USA pre-sales: షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో పఠాన్ సినిమాతో వచ్చి ఒక్కసారిగా కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను డామినేట్ చేసేందుకు జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. అయితే అదే నెలలో ప్రశాంత్ నీల్ రూపొందించిన యాక్షన్ ప్యాక్డ్ ప్రభాస్ మూవీ ‘సాలార్’ విడుదల కానుంది. ఒకే నెలలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ చాలా గ్యాప్ ఉంది. అయితే, ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్, ప్రీ-సేల్స్ విషయంలో షారుక్ ఖాన్ – ప్రభాస్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోటీ వాతావరణం నెలకొంది.
NTR-Mokshagna: అన్నదమ్ముల అనుబంధం.. ఏం ఉన్నార్రా బాబు
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు సలార్ సినిమా ప్రీ బుకింగ్స్ అమెరికాలో ఓపెన్ అయ్యాయి. ఇక అలా ఓపెన్ అయిన వెంటనే జవాన్ SA ప్రీ-సేల్స్‌ను కేవలం రెండు రోజుల్లో సలార్ బ్రేక్ చేసింది. జవాన్ మూవీ అమెరికా బుకింగ్స్ చాలా కాలం క్రితమే ఓపెన్ చేశారు. ఆ ప్రీ-సేల్స్ సుమారు 160 కే డాలర్లు వసూలు చేసింది. ఇక సలార్ ప్రీ బుకింగ్స్ 2 రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ప్రీ-సేల్స్ ఇప్పటికే 185 కే డాలర్స్ దాటేశాయి. విడుదలకు ఒక నెల కంటే ఎక్కువ సమయం ఉండడంతో సలార్ బుకింగ్స్ మరో లెవల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లోనే కాదు సలార్ సినిమా మీద సినీ ప్రేమికులు అందరిలో కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.