Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు. కానీ, మహానటి సినిమా చూసాకా.. ఆమె కీర్తి కాదు సావిత్రి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు.. తరాలు మారినా.. సావిత్రిగా కీర్తి గుర్తుండిపోతుంది. ఇక ఇలాంటి పాత్రలు గురించి చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. నిన్నటివరకు శాకుంతలంలో శకుంతలగా సమంత కూడా అలాగే గుర్తిండిపోతుంది అనుకున్నారు. కానీ, నేడు షో పడినాకా.. సమంత, శకుంతలగా సెట్ కాలేదని చెప్పుకొస్తున్నారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యానికి విఎఫ్ ఎక్స్ జోడించి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సమంత సినిమా అంటే.. అభిమానుల్లో ఉండే అంచనాలు వేరు. అదికాక మయోసైటిస్ వ్యాధిబారిన పడి కోలుకున్నాకా విడుదలైన మొదటి సినిమా కావడంతో సామ్ ఫ్యాన్స్.. ఎంతో హడావిడి చేస్తూ థియేటర్ కు వెళ్లారు. అయితే సినిమాను గుణశేఖర్.. ఏదో తీయాలి కాబట్టి తీశాడు.. ఎవరిలానో పేరు తెచ్చుకోవాలి అని విఎఫ్ ఎక్స్ ను జొప్పించి బలవంతంగా నొక్కి పెట్టినట్లు అనిపిస్తుంది కానీ, మనస్ఫూర్తిగా తీయలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Pan India: ఇక ఇప్పుడు అందరి చూపు ‘విరూపాక్ష’ మీదే!
ఇక ముఖ్యంగా శకుంతలగా సామ్..నప్పలేదని అంటున్నారు. ఆమె ఆహార్యం బాగానే ఉన్నా అభినయంలో ఎక్కడో లోటుపాట్లు కనిపించినట్లు అంటున్నారు. అనవసరం సామ్ ఈ పాత్రను ఒప్పుకొని రిస్క్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తాన్ని తన పాత్రతో నిలబెట్టగలిగే సామ్.. ఈ సినిమాకు ఆమె మైనస్ లా మారిందని, ఓ బేబీ, యశోద సినిమాలతో తను లీడ్ రోల్ చేసిన సినిమాలతో కూడా సక్సెస్ అందుకున్న సమంత శాకుంతలం తో అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అనుకున్నారు కానీ ఈ సారి అంత టాక్ కూడా వచ్చేలా లేదని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఏమైనారిజల్ట్ మారుతుందేమో చూడాలి.