SSMB 28: సెంటిమెంట్ తో టైటిల్ సెట్ చేస్తున్న మాటల మాంత్రికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ‘SSMB 28’ ఆగష్టు 11న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్ భారీగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also: RC 15: మార్చ్ 27న మెగా పండగ గ్యారెంటీనా?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 28 టైటిల్ గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. గతంలో ఈ సినిమాకు త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు.. వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ నడిచింది. అలాగే ‘ఆరంభం’ అనే టైటిల్ కూడా వినిపించింది. దాంతో వీటిలో ఏది ఫిక్స్ చేశారనేది సస్పెన్స్‌గా మారింది. ఇవి కాకపోయినా.. ‘అ’ సెంటిమెంట్‌తోనే ఈ టైటిల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మాటల మాంత్రికుడు ఈ టైటిల్స్‌లోనే ఏదైనా ఫిక్స్ చేస్తారా.. లేదంటే మరో కొత్త టైటిల్‌ను లాక్ చేస్తాడా.. అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే #ssmb28 పాటలు, ఒక ఫైట్ మినహా మిగిలిన సినిమా అంతా ఏప్రిల్ నెలాఖరుకు కంప్లీట్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మొత్తం మూడు ఫైట్లు మాత్రమే సినిమాలో పెట్టిన త్రివిక్రమ్, అరవింద సమేత తర్వాత అంత ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!