Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు. ఇక అందుకే గార్గి సినిమా తరువాత సాయిపల్లవి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఒక సినిమా.. హిందీ రామాయణ్ లో సీతగా సెలెక్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే లవ్ స్టోరీ వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.
Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
ఇక ఈ సినిమా కోసం సాయిపల్లవి భారీగా డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లు కూడా హీరోలకు ధీటుగా రెమ్యూనిరేషన్ అందుకుంటూ షాక్ ఇస్తున్నారు. ఇక కథను బట్టి, పాత్రను బట్టి హీరోయిన్స్ పారితోషికాలను డిమాండ్ చేస్తారు. ఇక హీరోయిన్స్ మార్కెట్ ను బట్టి నిర్మాతలు కూడా వారు ఎంత అంటే.. అంత ఇచ్చేస్తూ వస్తున్నారు. తండేల్ సినిమా కోసం సాయిపల్లవి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక సాయిపల్లవి అడిగితే .. నిర్మాతలు ఇవ్వకుండా ఉంటారా.. ? ఆమె మార్కెట్ అలాంటింది మరి. అందుకే నిర్మాతలు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.