ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ‘విరాటపర్వం’ సినిమా.. వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రిలీజ్‌కి ముస్తాబవుతోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అనూహ్యమైన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు కూడా చాలా డిఫరెంట్‌గా ఓ వీడియో రూపంలో ఇచ్చారు.
ఈ వీడియోలో ఓ అభిమాని (30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్) రానా ఆఫీస్ వద్దకు వెళ్లి కాస్త హంగామా చేస్తాడు. ఇంతలో రానా బయటకు రాగానే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ, ప్రమోషన్స్ ఏవీ? అని అడుగుతాడు. ఆ తర్వాత సాయి పల్లవిని చూడ్డానికి వెయిటింగ్ అని, తాను ఆ హీరోయిన్ అభిమానినని చెప్తాడు. అందుకు రానా బదులిస్తూ.. తాను కూడా సాయి పల్లవి అభిమానినే అని, అసలు ఆమె కోసమే ఈ సినిమా తీశామని చెప్తాడు. ఆమె ఫ్యాన్స్ కోసం కర్నూలులో జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నామని పేర్కొంటాడు. ఈ ఈవెంట్‌కి సాయి పల్లవి కూడా వస్తుందని చెప్పుకొస్తాడు.
ఈ ప్రమోషనల్ వీడియో చూసిన సాయి పల్లవి.. ‘‘ఇక్కడ అంత సీన్ లేదండి, ప్రజల ప్రేమను పొందుతోన్న నేనే చాలా అదృష్టవంతురాలిని. కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇదిలావుండగా.. రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.
Ikkada anthe scene ledhandi 🙊
Nene chaala lucky, ppl have been extremely kind and sweet.
I’m the one who’s excited to see them all at Kurnool❤️ https://t.co/MGdixjovwm— Sai Pallavi (@Sai_Pallavi92) June 4, 2022