Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ లో తేజ్ ఎమోషనల్ అయ్యాడు. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాక తాను అనుభవించిన నరకాన్ని ఏకరువు పెట్టాడు. ముందుగా తన తల్లి, తమ్ముడుకు సారీ చెప్పి, ఐ లవ్ యూ చెప్పిన తేజ్.. తరువాత ప్రేక్షకులకు సారీ చెప్పాడు. బైక్ నడపడమంటే తనకు ఇష్టమని, బైక్ మీద నుంచి కాలుజారి పడ్డాకా తాను చూసే విధానం మొత్తం మారిందని చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేశానని, అభిమానులను చాలా కంగారు పెట్టినందుకు తనను క్షమించమని కోరాడు.
Sukumar: స్టెరాయిడ్స్ తీసుకునేవాడు.. ఐదారేళ్లు మాత్రమే బతుకుతాడు
బెడ్ మీద మొట్టమొదటిసారి తన తల్లి, తమ్ముడు ముఖం చూసి.. సారీ .. ఐ లవ్ యూ అని చెప్పడానికి మాట రాలేదని, ఆ దుఃఖం కళ్ళలో వచ్చింది.. కడుపులో మండింది.. నేనేం తప్పు చేశాను.. నాకే ఇలా ఎందుకు అయ్యిందని ఏడ్చినట్లు చెప్పాడు. తన అమ్మకు మొదట ఒక ప్రామిస్ చేశాను అని, ఎలాగైనా తాను సినిమాల్లో నిలబడతాను అని చెప్పినట్లు చెప్పిన తేజ్.. తన రెండో సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చిత్రలహరితో నిలబడినట్లు చెప్పాడు.. ఆ తరువాత వరుసగా 6 ప్లాపులు.. అయినా వాటిని ఎదుర్కున్నాక.. సోలో లైఫ్ సో బెటర్ తో మళ్లీ హిట్ అందుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక మొత్తం సాఫీగా సాగుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ మళ్లీ తనను కిందపడేసిందని, అయినా ప్రేక్షకుల ప్రేమ కోసం, అభిమానుల ఆనందం కోసం ఎంతవరకైనా వెళ్తానని, తనకు అభిమానుల ప్రేమ ఇలాగే కావాలని దానికోసం ఎంత కష్టమైన అనుభవిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక తనను కాపాడింది హెల్మెట్ అని.. దయచేసి అందరూ హెల్మెట్ వాడాలని సూచించాడు. ఇక హెల్మెట్ అంటే వేరేది కాదని, బండి మీద వెళ్ళేటప్పడు తలకు పెట్టుకొనే హెల్మెట్ అని .. ఇక్కడ ఉన్నవారందరూ చాలా నాటి వేరే హెల్మెట్ అనుకోకండి అంటూ నవ్వులు పూయించాడు. ఇక అమ్మాయిల కోసం అబ్బాయిలు ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేయండి అని చెప్పిన తేజ్ .. వారు అబ్బాయిల కోసం ఎంత కష్టమైన భరిస్తారు అని తెలిపాడు.
Orange Army: ఆరెంజ్ ముద్దుగుమ్మలు.. ఎంత ముద్దొస్తున్నారో
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 21 న బ్లాక్ బస్టర్..పక్కా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. కార్తీక్, సుకుమార్ మంచి కథనుఇచ్చారు.. థాంక్యూ. ఇక చిత్రబృందంలో పనిచేసిన వారందరికీ థాంక్స్.. నన్ను భరించారు.మీ ప్రేమను పొందడానికి మళ్లీ ఈ సినిమాతో వస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, మా గురువు పవన్ కళ్యాణ్ కు, మీకు చాలా చాలా థాంక్స్. నా గురువు గారు పవన్ కళ్యాణ్.. ఆయన 2019 లోనే నాకు డ్యాన్స్ లు నేర్పించి, నటన నేర్పించి ఇక్కడ ఉండేలా చేశారు. అలాంటి గురువు తో కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు సముద్రఖని గారికి థాంక్స్. సినిమా పిచ్చెక్కిపోతుంది.. మీరందరు కకాలర్స్ ఎగరవేయొచ్చు.. ఏప్రిల్ 21 నే కాదు.. జూన్ 28 ను కూడా.. మీరు కాలర్స్ ఎగరేస్తారు.. ఇక మా ముగ్గురు మామయ్యలకు థాంక్స్. వారు లేకపోతే నేను లేను” అంటూ తేజ్ చెప్పుకొచ్చాడు.