Sukumar: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఇక నేడు ఏలూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
Orange Army: ఆరెంజ్ ముద్దుగుమ్మలు.. ఎంత ముద్దొస్తున్నారో
ఇక ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ.. ” కార్తీక్ దండు.. నా శిష్యుడు.. అతను మొదట ఒక కథ చెప్పాడు.. నచ్చలేదు.. కథ నచ్చలేదు కానీ నేరేషన్ బాగా చెప్తాడు. ఆ తరువాత విరూపాక్ష కథతో నా దగ్గరకొచ్చాడు .. నేను షాక్ అయ్యాను. ఆ తరువాత అతనికి బాపినీడును పరిచయం చేసి, సాయికి కథ చెప్పించాను. కార్తీక్ లైఫ్ చాలా చిన్నది. ఒక ఐదారేళ్లు మాత్రమే బతుకుతాడేమో.. కార్తీక్ కు ఒక మెడికల్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ అమ్మ తనను హైదరాబాద్ తీసుకొచ్చి.. తన లైఫ్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు సినిమా డైరెక్ట్ చేసి చచ్చిపోవాలనుకున్నాడు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు బయటపడి ఈ సినిమా తీసాడు. స్టెరాయిడ్స్ తీసుకునేవాడు.. అవి తీసుకోకపోతే ప్లేట్ లెట్స్ పెరగవు. అలాంటి స్థితి నుంచిబయటికి వచ్చి ఈ సినిమా తీయడం అమ్మ ఆశీస్సులే కారణం. సినిమా చాలా బాగా తీశాడు. నేను కేవలం సపోర్ట్ చేశాను అంతే.. కార్తీక్ కు ఈ సినిమాతో ఆయనకు మంచిపేరు రావాలి.. పెద్ద డైరెక్టర్ గా మారాలి అని కోరుకుంటున్నాను. ఇక నిర్మాత ప్రసాద్ గారు జగడం సమయంలో నెలకు డబ్బులు పంపేవారు.. అప్పటినుంచి ఆర్య 2 వరకు మేము కొనసాగాం.
Pooja Hegde: కారు గిఫ్ట్ ఇచ్చినా బావుండేది.. ఏంటి పూజా అంత మాట అనేశావ్
ఇక సంయుక్త మీనన్ చాలా చక్కగా నటించింది. తెలుగు చాలా బాగా మాట్లాడింది. ముందు నేను సంయుక్తను ఓకే చేయలేదు. ఎందుకంటే ఆమెకు పెద్ద కళ్లు లేవు.. కానీ సినిమాలో ఆమె ఎంతో అందంగా కనిపించింది.ఆమెకు మంచి గుర్తింపును తెస్తుంది ఈ సినిమా. ఇక సాయి గురించి చెప్పాలంటే.. మేము మొదటిసారి దిల్ రాజు కూతురు పెళ్ళిలో కలిసాం. సాయి ఒకటే జోక్స్ .. అసలు ఎంత నవ్వించాడో చెప్పలేం.. ఎప్పుడుచలాకీ గా ఉండే సాయిని విరూపాక్ష సినిమా సెట్ లో చూసి చలించిపోయాను. ఇప్పుడు సాయిని కాదు అప్పుడు సాయిని ను చూస్తే ఎవరికి కన్నీళ్లు ఆగవు. ఒక్కొక్క అక్షరం కూడబలుక్కొని చెప్తున్నాడు. కానీ, ఎక్కడా తగ్గకుండా నేర్చుకొని ఇక్కడవరకు వచ్చాడు. లవ్ యూ సాయి. ఇక చిత్ర బృందంలో పనిచేసిన వారందరికీ థాంక్స్.. అందరికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.