Roshan Kanakala: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఉంహించుకోవడం కష్టం. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా అందరికి తెల్సిందే. ప్రస్తుతం వీరి కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే సుమతో పాటు ప్రతి షోకు వెళ్లి హైప్ తీసుకొస్తున్నాడు రోషన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడాడు.
ఎప్పటినుంచో సుమ- రాజీవ్ మధ్య విబేధాలు నెలకొన్నాయని, వారు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విడాకుల రూమర్స్ పై సుమ, రాజీవ్ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా క్లారిటీ ఇచ్చారు. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకునేంత గొడవలు తమ మధ్య లేవని సుమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా రోషన్ మాట్లాడుతూ.. ” అమ్మానాన్నల విడాకుల వార్తలు నేను కూడా చదివాను. అసలు ఎందుకు వీళ్ళు ఇలా రాస్తున్నారు.. అమ్మానాన్న మాకు చెప్పడం లేదా.. ?అని డైరెక్ట్ గా నేను వారినే అడిగాను. ఛీఛీ ఏం మాట్లాడుతున్నావ్.. మేము విడాకులు తీసుకోవడమేంటి అని అన్నారు. లేదు ఇలా వార్తలు వస్తున్నాయి.. ఇంట్లో ఉన్న మాకే తెలియదు.. వాళ్ళెందుకు అలా అనుకుంటున్నారు అని అంటే.. అందులో నిజం లేదు అని చెప్పారు. ఆ తరువాత ఆ వార్తలను నేను కూడా లైట్ తీసుకున్నాను” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.