Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ ఓదెల-2. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు భారీ అంచనాలు పెంచేశాయి. పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనైన్స్ చేశారు. ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ లోనే కొంత రిస్క్ ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఒక వారం ముందు స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ సినిమా జాక్ వస్తోంది. దాంతో పాటు అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండింటిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read Also : KKR vs RCB : రఫ్ఫాడించిన కెప్టెన్ రహానే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎంతంటే?
ఇందులో ఏది హిట్ టాక్ తెచ్చుకున్నా సరే ఓదెల-2పై ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ రెండూ హిట్ టాక్ సంపాదించుకుంటే ఓదెల-2 ఆ వేవ్ ను తట్టుకోవడం కష్టమే. అలాగే ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా రిలీజ్ అవుతోంది. దాని మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. చాలా మంది స్టార్లు నటిస్తుండటంతో దాని గురించి ఎదురు చూస్తున్నారు. అది గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఓదెల-2కు కలెక్షన్లు తగ్గడం ఖాయం. ఎటు చూసినా ముందు, వెనక రిస్క్ ఉంది. ఓదెల-2 భారీ హిట్ టాక్ సంపాదిస్తే తప్ప ఈ పోటీని తట్టుకోవడం కష్టమే అంటున్నారు సినిమా నిపుణులు.