Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్‌తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎవరైనా కళ్లలోకి చూసి నాకు నువ్వు కావాలి, నాతో ఉండు అని తప్పుడు ఉద్దేశ్యంతో అడగడం అంత ఈజీ కాదని అందుకే అప్పట్లో అంతగా ఇలాంటివి ఉండేవి కాదని అర్ధం వచ్చేలా ఆమె మాట్లాడారు. ఈరోజుల్లో ఒక్క మెసేజ్ పెడితే వచ్చి కలువు, కాఫీ తాగుదామా అని వందల మెసేజ్ లకు దారి తీస్తోందని ఈరోజుల్లో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు మొబైల్ ఫోన్ల వల్లే వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
మొబైల్ ఫోన్ల వల్ల ఎమోజీల వాడకం కూడా ఎక్కువయ్యిందని, అది అతిపెద్ద సమస్యగా మారిందని ఆమె అన్నారు. ఎమోజీలను సరిగా అర్థం చేసుకొని ఉపయోగించాలని లేపోతే అది అవతలి వ్యక్తికి తప్పుగా అర్థమయ్యి అనేక సమస్యలకు దారితీస్తుందని ఆమె అన్నారు. ప్రొఫెషనల్‌గా మాట్లాడుకుంటున్న సమయంలో ఎమోజీలు ఉపయోగించడం మంచిది కాదని ఆమె సలహా ఇచ్చారు. ఒకప్పుడు స్త్రీ, పురుషులు అనేవారు ఒక దగ్గర ఉంటే సరదాగా మాట్లాడడం అనేది ఉండేది కానీ అది దాటి వెళితే అంగీకారం కావాలి, ఆ అంగీకారం ఇండస్ట్రీలో ఉండేది కాదని అన్నారు. అప్పట్లో ఏదైనా చెడు అనుభవం ఎదురైతే నవ్వి నో అని చెప్పేవాళ్లమని, ఆ తర్వాత క్లోజ్‌గా ఉండేవాళ్లతో ఆ విషయాన్ని షేర్ చేసుకునేవాళ్లమని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తిస్తే అలా మాట్లాడిన వారికి కొంచెం బుద్ధి ఇస్తే బాగుంటుంది అనుకునేదాన్ని కానీ పైకి మాత్రం నవ్వి వదిలేసేదాన్నని ఆమె అన్నారు.