Renu Desai: నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ, రేణు కు మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రేణు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లలతో ఎంజాయ్ చేసి క్షణాలను, సమాజంలో ఆమెను కదిలించే అంశాల గురించి మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తాజాగా రేణు యానిమల్ సినిమా రివ్యూ ఇచ్చి షాక్ ఇచ్చింది. అంత వైలెన్స్, న్యూడిటీ ఉన్న సినిమాకు రివ్యూ ఇస్తే నెటిజన్స్ ఎక్కడ ట్రోల్ చేస్తారో అని చాలామంది సినిమా గురించి చెప్పడం కూడా మానేశారు. కానీ, రేణు ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను అని చెప్పడం షాకింగ్ కు గురిచేస్తోంది.
ఇన్స్టాగ్రామ్ లో యానిమల్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. “ఎట్టకేలకు నిన్ననే సినిమా చూడాల్సి వచ్చింది. నిస్సందేహంగా దానితో ప్రేమలో పడ్డాను… క్రేజీ, బ్లడీ యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగా బలహీన హృదయం ఉన్నవారి కోసం కాదు, కానీ మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా థియేటర్‌లో చూడటం మిస్ అవ్వకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.