మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే ప్రభాస్ పెళ్లి అయ్యాక అంటాడు. ఈ చైన్ సర్కిల్ ని బ్రేక్ చెయ్యాడానికి ఒక యంగ్ హీరో కంకణం కట్టుకున్నట్లు ఉన్నాడు. శర్వానంద్ ని పెళ్లి చేసుకో అన్నా అంటూ కన్వీస్ చేసే పనిలో ఉన్న ఆ యంగ్ హీరో ‘సంతోష్ శోభన్’. పెళ్లి గురించి చెప్తూ ‘వెడ్డింగ్ ఆంథెమ్’ని కూడా పాడేస్తున్నాడు. ఇంతకీ అసలు సంతోష్ శోభన్ కి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘వెడ్డింగ్ ఆంథెమ్’ అనే సాంగ్ ని డిజైన్ చేశారు.
ఈ క్రేజీ సాంగ్ ని ప్రభాస్ లాంచ్ చెయ్యడం విశేషం. హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో, అతను ఈ ‘వెడ్డింగ్ ఆంథెమ్’ సాంగ్ లో కనిపించడం ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ఈ సాంగ్ ని ఎత్తుకున్న విధానం చాలా ఫన్నీగా ఉంది. శ్రీ చరణ్ పాకలా మ్యూజిక్ కంపోజ్ చెయ్యడమే కాకుండా వోకల్స్ కూడా ఇచ్చిన ఈ సాంగ్ లిరిక్స్ ని కృష్ణ కాంత్ రాసాడు. సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్ధం అయ్యింది అంటూ శర్వానంద్, ప్రభాస్ కి కాల్ చెయ్యడం బాగుంది. మరి ప్రభాస్ తో శర్వానంద్ ఏం మాట్లాడాడో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత సంతోష్ శోభన్ పడిన కష్టాలు ఎలాంటివో తెలియాలి అంటే మాత్రం జనవరి 14న థియేటర్స్ కి వెళ్లాల్సిందే.
Here's a Crazy "WEDDING ANTHEM" from #KalyanamKamaneeyam launched by DARLING #Prabhas garu💥
Now, @ImSharwanand knows what to do😉https://t.co/ADp7A8WMSn@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar @SricharanPakala #SureshSarangam @AforAnilkumar @kk_lyricist pic.twitter.com/ssguVJ9Ara
— UV Creations (@UV_Creations) January 10, 2023