ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్న ఆదిపురుష్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆదిపురుష్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ నెగటివిటీని సొంతం చేసుకొని ఆదిపురుష్ సినిమాపైనే అనుమానాలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత నెగిటివిటీ అనే మాటనే వినిపించకుండా చేసారు ఆదిపురుష్ మేకర్స్. ఈ క్రెడిట్ డైరెక్టర్ ఓం రౌత్ దృఢ సంకల్పానికి మాత్రమే ఇవ్వాలి. 550 కోట్లు పెట్టి చేసిన ఒక సినిమాని, కార్టూన్ మూవీ అనే స్థాయిలో ట్రోలింగ్ చేసినా, తన మేకింగ్ పైనే నమ్మకం ఉంచిన ఓం రౌత్, ఆరు నెలలు తిరిగే సరికి ట్రోల్ చేసిన వారితోనే పొగిడించుకున్నాడు. టీజర్ తర్వాత వచ్చిన నెగటివిటీని చెరిపేస్తూ మళ్లీ కొత్తగా ప్రమోషన్స్ మొదలు పెడుతూ మేకర్స్ ఫస్ట్ ఒక మోషన్ పోస్టర్ వదిలారు.
జై శ్రీరామ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా ప్రభాస్ రాముడి గెటప్ లో బాణం పట్టుకొని నిలబడి ఉన్న మోషన్ పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడి నుంచి ఆదిపురుష్ తలరాత మారిపోయింది. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్, సాంగ్స్ తో ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. దీంతో ఆదిపురుష్ పై ఉన్న నెగిటివిటీ ఒక్కసారిగా మాయం అయిపోయి, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలని మరింత పెంచింది ఆదిపురుష్ ట్రైలర్, ఈ ట్రైలర్ తో ఆదిపురుష్ బిజినెస్ నంబర్స్ స్కై హై రేంజులో పెరిగాయి. 100-150 కోట్ల ఓపెనింగ్స్ ని ఆదిపురుష్ అవలీలగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు. ఈ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని మరింత పెంచడానికి ట్రైలర్ 2ని రెడీ చేస్తున్నాడు ఓం రౌత్. 2:27 నిమిషాల నిడివితో ట్రైలర్ 2 ని కట్ చేసారని సమాచారం. ఈ ట్రైలర్ ని జూన్ 6న తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. సెకండ్ ట్రైలర్ బయటకి వచ్చేస్తే ఆదిపురుష్ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు, ఆకాశాన్ని తాకే స్థాయికి వెళ్లనున్నాయి.