Reason Behind Anasuya Vijay Deverakonda Spat: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్‌ల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలో ఒక బూతు డైలాగ్ విషయంపై మొదలైన వీరి గొడవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి మధ్య గొడవలో విజయ్ దేవరకొండ పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు కానీ, అనసూయ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా అతడ్ని టార్గెట్ చేస్తోంది. అతడ్ని ఉద్దేశిస్తూ ట్వీట్లతో విరుచుకుపడుతోంది. అందుకు విజయ్ ఫ్యాన్స్ ఘాటుగా రెస్పాండ్ అవ్వడం, అనసూయ అంతే స్ట్రాంగ్‌గా రిప్లైలు ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు రీసెంట్‌గా కూడా విజయ్‌ని టార్గెట్ చేస్తూ.. అనసూయ ఒక సెటైరికల్ ట్వీట్ చేసింది. విజయ్, సమంత కాంబోలో రూపొందుతోన్న ‘ఖుషీ’ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ద’ అనే ట్యాగ్ ఉండడాన్ని చూసి.. దానిపై వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యింది. ‘‘ఇప్పుడే నేను ఒకటి చూశాను. ‘ద’ నా? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. వెంటనే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి, ఆమెపై దాడికి దిగారు. తద్వారా.. అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధం మొదలయ్యింది.
Krunal Pandya: కృనాల్ పాండ్యా చెత్త రికార్డ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఢమాల్
ఈ గొడవ సంగతులు పక్కనపెడితే.. అనసూయ ప్రతీసారి ఇలా విజయ్‌ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద తతంగమే దాగి ఉందని తాజాగా ఓ ప్రచారం తెరమీదకి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఒక సినిమా ఫంక్షన్‌లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌తో విజయ్ గొడవ పడ్డాడట! తన సినిమా (లైగర్) గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని టాక్. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అందుకు ప్రతీకారంగానే.. విజయ్‌పై అనసూయ ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా కోపం ప్రదర్శిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో, కాదో తెలీదు కానీ.. అనసూయ, విజయ్‌ల మధ్య గొడవ మాత్రం ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు.
Police Over Action: పోలీసుల ఓవరాక్షన్.. దుర్భాషలాడుతూ, చెయ్యి చేసుకొని..