Police Over Action In Hanmakonda: అందరూ కాదు కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమ ఒంటిపై ఉన్న ఖాకీ బట్టలను చూసుకొని విర్రవీగుతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందని రెచ్చిపోతున్నారు. తప్పు ఏం లేకపోయినా సరే, సాధారణ ప్రజల్ని హింసిస్తారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమని విడిచిపెట్టమని ప్రాధేయపడినా సరే.. కనికరం చూపకుండా మరింత రెచ్చిపోతారు. ఒకవేళ ఎదురుతిరిగితే మాత్రం.. చెయ్యి చేసుకుంటారు. ఇలాంటి వ్యవహారాలు దేశం నలుమూలల ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ఓవరాక్షన్‌కి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
Balayya – Boyapati Film: అఖండ 2 కాదు.. పొలిటికల్ వార్?
ఇప్పుడు హన్మకొండలోనూ దాదాపు అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. కేవలం పెళ్లి బారాత్ ఆలస్యం అయ్యిందన్న కారణంగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇది సమయం కాదని, త్వరగా కార్యాన్ని ముగించమని చెప్తే పోయేదాన్ని.. చెయ్యి చేసుకునేదాకా వ్యవహారాన్ని తీసుకెళ్లారు. తమకు కొద్ది సమయం ఇవ్వాలని, తాము వెళ్లిపోతామని ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. ఇంకా దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా.. ఒక యువకుడిపై ఎస్సై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో వదిలాడు. అందులో ఓ యువకుడు తొలుత మహిళా పోలీస్ కాళ్లపై పడటాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఓ ఎస్సై వద్దకు ఆ యువకుడు వచ్చి నోరుపారేసుకోగా.. ఎస్సై చెంపఛెళ్లుమనిపించాడు.
Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
దీంతో.. అక్కడున్న వారంతా గుమికూడారు. అసలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు. తమ తప్పు లేకపోయినా ఎందుకు ఆపారని, వెళ్లిపోతామని చెప్తున్నా ఎందుకు విడిచిపెట్టట్లేదని, ఇప్పుడేమో చెయ్యి చేసుకుంటున్నారని పోలీసుల మీదకి వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. పోలీసుల తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా పెళ్లి బారాత్‌ని అడ్డుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ వాళ్లు రాద్ధాంతం చేస్తే జోక్యం చేసుకోవాలి కానీ, ఇలా పెళ్లి తంతుని అడ్డుకుంటారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారింది.