Tammudu : నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ పై మళ్లీ రూమర్లు వస్తున్నాయి. వాయిదా పడుతుందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 4కు వాయిదా పడింది. దీంతో తమ్ముడు మూవీ వాయిదా వేస్తారేమో అంటున్నారు. ఇంకోవైపు పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జూన్ 12కు రావట్లేదు. ఆ మూవీని జులై 4న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని.. తమ్ముడు వాయిదా తప్పదంటూ వార్తలు వస్తున్నాయి.
Read Also : Bengaluru Stampede: హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ!
తాజాగా వాటిపై టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తలన్నీ అవాస్తవమే అని కొట్టిపారేసింది. ముందుగా ప్రకటించిన జులై 4కే తమ్ముడు సినిమాను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తమ సినిమా డేట్ లో మార్పు ఉండదంటున్నారు. నితిన్ నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆరాటంతో ఉన్నాడు నితిన్. ఒకవేళ వీరమల్లు ఇదే డేట్ కు వస్తే కింగ్ డమ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. అప్పుడు తమ్ముడు మూవీ వీరమల్లుతో పోటీ పడక తప్పదు. ఏదేమైనా రిలీజ్ డేట్ లో మార్పు లేకపోతే మాత్రం ఏదో ఒక సినిమాతో పోటీ పడాల్సిందే.
Read Also : S*exual Harassment: ఉద్యోగం కోసం వెళితే.. పోర్న్‌లో నటించాలని చిత్రహింసలు..!