Ravi Teja- Harish Shankar Bachhan Saab Movie Update: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్‌లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోందని ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాయి.
CM YS Jagan: మార్పులు, చేర్పులపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారిపై అసంతృప్తి..!
ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటర్ గా ఉజ్వల్ కులకర్ణి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘రైడ్’కి రీమేక్‌గా రూపొందుతున్నట్లు చెబుతున్నారు. అజయ్ దేవగన్ హీరోగా 2018లో ఈ సినిమా రిలీజ్ కాగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఐటీ రైడ్స్ లో భాగంగా బిగ్ షాట్ ఇంటికి వెళ్లిన హీరోకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతే వాటిని తట్టుకుని ఎలా డ్యూటీ చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. సూపర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆకట్టుకుంది. ఈ సినిమా కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి హరీష్ తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు.