Rathan Raajputh: క్యాస్టింగ్ కౌచ్ .. దీని గురించి అందరికి తెలిసిందే. ప్రతి రంగంలోనూ ప్రతో అమ్మాయి ఈ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మరింత ఎక్కువగా నాటుకుపోయింది. అవకాశం కావాలి అంటే.. డైరెక్టర్ దగ్గరనుంచి సినిమాటోగ్రాఫర్ వరకు కాంప్రమైజ్ కావాల్సిందే. ఇలా ఎంతోమంది హీరోయిన్లు మనసు చంపుకొని కాంప్రమైజ్ అయినవారు ఉన్నారు. మనసు చంపుకోలేక కష్టపడి పైకి రావడానికి ఎన్నో అవమానాలను భరించినవారు ఉన్నారు. చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్ బాలీవుడ్ లోనే ఎక్కువ ఉంటుంది అని అంటూఉంటారు .. కానీ, సౌత్ లో కూడా చాలామంది తనను వేధించారని ఒక నటి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు రతన్ రాజ్ పుత్. బాలీవుడ్ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న రతన్.. తానూ కెరీర్ మొదట్లో సౌత్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.
Mouni Roy: హాస్పిటల్ లో ‘నాగిని’.. ఏమైంది.. ?
“అప్పుడు నేను హిందీలో అగ్లె జనం మోహె బిటియా హి కిజో చేస్తున్నాను. సౌత్ నుంచి నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఆడిషన్స్ కు కూడా వెళ్ళాను. అందులో కొంతమంది మంచివారు ఉన్నారు.. మరికొందరు వంకరబుద్ధి చూపించేవారు. ఓ ఆడిషన్ కు వెళ్తే అక్కడ నన్ను చూసిన డైరెక్టర్.. కొద్దిగా బక్కగా ఉన్నావు.. కొంచెం బరువు పెరగాలి అని చెప్పాడు. నేను ఓకే అన్నాను. వెంటనే ఇక్కడ రూల్స్ తెలుసు కదా అన్నాడు. నాకు అర్ధం కాక.. ఏం రూల్స్ అండీ అని అడిగాను.. అదే.. ఇక్కడ హీరో, డైరెక్టర్, నిర్మాత.. కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్ పిలిచినా వెళ్ళాలి అన్నాడు. మీరు సరిగ్గా చెప్పడం లేదు.. నాకు అర్ధం కాలేదు అని అడగగానే .. అదే కాంప్రమైజ్ అవ్వాలి.. ఎవరితోనైనా పడుకోవాలి.. అని అనేసాడు. దీంతో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి వచ్చేశాను. ఇప్పటివరకు నాకు సౌత్ నుంచి ఇంకే అవకాశం రాలేదు. అందుకే నేను సౌత్ నుంచి ఆఫర్స్ రాకపోయినా లెక్క చేయను. బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు.. సౌత్ లో కూడా హీరో దగ్గరనుంచి అందరు పడుకోమనేవారే ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.