Rathan Raajputh: క్యాస్టింగ్ కౌచ్ .. దీని గురించి అందరికి తెలిసిందే. ప్రతి రంగంలోనూ ప్రతో అమ్మాయి ఈ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మరింత ఎక్కువగా నాటుకుపోయింది. అవకాశం కావాలి అంటే.. డైరెక్టర్ దగ్గరనుంచి సినిమాటోగ్రాఫర్ వరకు కాంప్రమైజ్ కావాల్సిందే. ఇలా ఎంతోమంది హీరోయిన్లు మనసు చంపుకొని కాంప్రమైజ్ అయినవారు ఉన్నారు.