కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం “మిషన్ మజ్ను” విడుదల తేదీ ఖరారైంది. మేకర్స్ వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి మంచి ప్లాన్ వేశారు. 2022 మే 13న ‘మిషన్ మజ్ను’ సినిమా విడుదల తేదీగా లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Read Also : సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్
తర్వాత దేశంలోని అనేక ప్రముఖ నగరాల్లో భారీగా ప్రమోషన్లు జరుగుతాయి. “మిషన్ మజ్ను” భారతదేశం రహస్య గూఢచార సంస్థ ‘రా’ పాకిస్తాన్ అతిపెద్ద రహస్య మిషన్ ను నిర్వహిస్తుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బాగ్చి ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. తెలుగులో రష్మిక నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది.