విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన నటిస్తూ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది, ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రష్మిక తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఫ్యాన్ బేస్ వచ్చింది అనుకుందో లేక కథ నచ్చిందో తెలియదు కానీ రష్మిక ఎట్టకేలకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యింది.
‘రెయిన్బో’ అనే టైటిల్ తో తెలుగు తమిళ భాషల్లో రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఈరోజే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీని డ్రీం వారియర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ‘రెయిన్బో’ సినిమాని శాంతారూబెన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మలయాళ నటుడు, శాకుంతలం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమవనున్న ‘దేవ్ మోహన్’ ఈ మూవీ స్పెషల్ రోల్ ప్లే చెయ్యనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ‘రెయిన్బో’ సినిమాతో రష్మిక, నేషనల్ క్రష్ నుంచి సొంత మార్కెట్ క్రియేట్ చేసుకోని లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతుందేమో చూడాలి.