Rashmika Mandanna opts out of Nithin- Venky Kudumula film: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ క్రేజ్ అందుకున్న ఆమె టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం సినిమాలతో వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతానికి ఆమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు హిందీ, తమిళ ప్రాజెక్టులలో కూడా భాగమవుతోంది. ఆమె చేసిన తమిళ వారిసు సినిమా తమిళనాడులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అలానే హిందీలో ఆమె చేసిన గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఈ మధ్యనే ఆమె నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్టులో హీరోయిన్గా నటిస్తుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.
Manchu Manoj: తాండూరు ఎమ్మెల్యే అతిరుద్ర మహాయాగంలో మెరిసిన మంచు మనోజ్ దంపతులు
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రష్మిక ఒకపక్క పుష్ప సీక్వెల్ పుష్ప సెకండ్ పార్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అదే సమయంలో రెయిన్బో అనే తమిళ తెలుగు బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. అదే సమయంలో మరో తెలుగు సినిమాతో పాటు రెండు హిందీ ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకి డేట్లను అడ్జస్ట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరిపి ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. దీంతో సినిమా యూనిట్ ఇప్పుడు హీరోయిన్ కోసం వేటలో పడ్డారు. 2020లో భీష్మ అనే ప్రాజెక్టు కోసం నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి రష్మిక పని చేసింది. ఆ తరువాత ఈ ముగ్గురూ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో ప్రాజెక్ట్ ను ఉగాదికి అనౌన్స్ చేశారు, ఆ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు.