Rashmika : రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని అర్థం అవుతోంది. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా.
Read Also : Priyanka Chopra : ప్రియాంకచోప్రాకు అంత సీన్ లేదు.. మాజీ ప్రపంచసుందరి కామెంట్స్
ఈ పోస్టర్ ను చూస్తే అనుష్క, కీర్తి సురేష్ గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్లు కూడీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము లేపారు. ముఖ్యంగా అనుష్క చేసిన అరుంధతి సినిమాతో యూత్ లో మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ దెబ్బతో తన మార్కెట్, రెమ్యునరేషన్ అన్నీ పెరిగిపోయాయి. అలా అని హీరోల సరసన చేయడం ఆపలేదు.
అటు కీర్తి సురేష్ కూడా అంతే. మధ్యలో మహానటి సినిమా చేసి తన స్థాయిని పెంచేసుకుంది. అప్పటి నుంచే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఇంకా పెంచుకుంది. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో వెళ్లి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఇన్ని రోజులు గ్లామర్ హీరోయిన్ చేసిన ఆమె.. ఇప్పుడు నటన పరంగా యాక్షన్ పరంగా నిరూపించుకుని సొంతంగా ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తోంది. ఆల్రెడీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినా.. దాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు ఈ మైసా మూవీ చేస్తోందని సమాచారం.
Read Also : Samantha – Sreeleela : ఒకే స్టేజిపై పుష్పరాజ్ భామలు..