Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ అంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి తరువాత అంతకు మించి వైలెన్స్ తో సందీప్ .. ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్.. అంచనాలను రెట్టింపు చేసాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. యానిమల్ అనేది.. తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తుంది. ఇక రణబీర్ ఈ సినిమాలో చాలా తప్పులు చేశాను అని బహిరంగంగా చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్‌దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ.. ” మా ప్రతి సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను, అలియా అందులో కథ,పాత్రలు గురించి మాట్లాడుకుంటాం. యానిమల్ సినిమా చేసేటప్పుడు.. నాకెందుకో సినిమాలో చాలా తప్పులు చేశా అని అనిపించింది. అలా చేయడం కరెక్ట్ యేనా.. ? తప్పు చేస్తున్నాను అనే ఫీల్ వచ్చేది. దీని వలన తెలియకుండానే బాధ వచ్చేసింది. ఆ సమయంలో అలియా.. నాకు దైర్యం చెప్పేది. ఇది కేవలం సినిమా మాత్రమే అని, ఎక్కువ ఆలోచించకు అంటూ చెప్పుకొచ్చేది. అంతేకాకుండా.. ఈ సినిమాలో పాత్ర వెనుక ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దాన్ని బట్టే ఆ పాత్ర అలా చేస్తుంది అని దైర్యం చెప్పేది. దానివల్లనే నేను షూటింగ్ ను చాలా ఈజీగా చేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.