Rana Daggubati cameo in Nikhil’s SPY: మన టాలీవుడ్ లో వారసుల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అనేకమంది వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఇతర విభాగాల్లో సత్తా చాటారు, చాటుతున్నారు. అయితే నిర్మాతల కుటుంబం నుంచి వచ్చి హీరో అయ్యి ఇప్పుడు మళ్లీ సినిమాల నిర్మాణం మీద దృష్టి పెడుతున్న దగ్గుబాటి రానా సైలెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాలో భాగమైనట్టు ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే లీడర్, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న రానా నటుడిగా స్పీడ్ తగ్గించారు. ఆయన అనారోగ్య సమస్యల వల్ల కొంత నటనకు గాప్ తీసుకుంటున్నారు అనే ప్రచారం అయితే ముందు నుంచీ ఉంది.
Spy Release Date: నిఖిల్ చేత కూడా చెప్పించేశారు.. 29నే వరల్డ్ వైడ్ రిలీజ్
ఇక ఇప్పుడు తాజాగా ఆయన సైలెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాలో నటించాడని అయితే అది అతిథి పాత్ర మాత్రమేనని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే నిఖిల్ సిద్దార్థ్ హీరోగా గ్యారీ బీహెచ్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కింది. మన భారత దేశం గర్వించే ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయంలో కొంత వివాదం నడిచినా ఎట్టకేలకు జూన్ 29నే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమాలో రానా ఒక అతిథి పాత్రలో నటించగా ఆ పాత్రకు డబ్బింగ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. నటనకు గ్యాప్ ఇచ్చిన రానా సినిమాల నిర్మాణం మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ మధ్యనే పరేషాన్ అనే సినిమాను ఆయన ప్రెజెంట్ చేశారు.