Baahubali : బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించడం కాదు.. జీవించేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు మాట్లాడుతూ.. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్ర నువ్వు చేశావ్ తెలుసా అని ప్రశ్నించాడు.
Read Also : Naga Vamsi : కింగ్ డమ్ ప్లాప్ కాదు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్
దానికి రమ్యకృష్ణ రిప్లై ఇస్తూ.. అసలు ఆ పాత్రకు ముందుగా శ్రీదేవిని అనుకున్నారనే విషయం నాకు తెలియదు. కానీ నేను బాహుబలిలో నటించడం నా అదృష్టం. కొన్ని రకాల మ్యాజిక్స్ అలా జరిగిపోతుంటాయి అంటూ తెలిపింది రమ్యకృష్ణ. శోభు మాట్లాడుతూ.. రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం ఒక డెస్టినీ. ఆ పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించింది అంటూ చెప్పుకొచ్చాడు శోభు. బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా.
Read Also : Allu Aravind : బన్నీవాసును పొట్టుపొట్టు తిట్టిన అల్లు అరవింద్..