Ramayana : భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రామాయణ మొదటి నుంచి అంచనాలను పెంచేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయి మంచి అంచనాలు పెంచేసింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తున్నారంట. మొదటి పార్టుగా వస్తున్న తాజాగా రామాయణ మూవీని రూ.900 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Read Also : Raviteja : రవితేజ లైఫ్ ఇస్తే.. వాళ్లు పట్టించుకోవట్లేదా..?
కానీ రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాను.. మొదటి పార్టు కోసం రూ.900 కోట్లు, రెండో పార్టు కోసం రూ.700 కోట్లు కేటాయిస్తున్నారంట. నార్త్, సౌత్ స్టార్లతో కలగలిపి తీస్తున్న ఈ సినిమాలో అందరూ ట్యాలెంటెడ్ యాక్టర్లే ఉండటం విశేషం. ఇండియాలోనే భారీ విజువల్ వండర్ గా దీన్ని మల్హోత్రా టీమ్ తీసుకొస్తోంది. పైగా అందరూ క్రేజీ యాక్టర్లే కావడం ఇక్కడ మరో అంశం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెగ్యులర్ గా జరుగుతోంది. రామాయణం మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా.. ఇప్పటి జనరేషన్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొస్తున్నారు.
Read Also : Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?