Raviteja : హీరో రవితేజ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కెరీర్ లో ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే కొత్త వారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. సొంతంగా ఎదిగిన హీరో కదా.. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రవితేజకు మొదటి నుంచి అలవాటే. అందుకే కాబోలు ఆయన లిస్ట్ లో ప్లాపులే ఎక్కువగా ఉంటాయి. మరి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చుకదా అనే వారు లేకపోలేదు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే రవితేజ. అందులో చూసుకుంటే గోపీచంద్ మలినేని, బాబీ, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్లకు ఫస్ట్ అవకాశం ఇచ్చిందే రవితేజ.
Read Also : NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
మరి ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఎందుకు రవితేజతో సినిమాలు చేయట్లేదు అని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. పైన చెప్పిన ఏ డైరెక్టర్ కూడా ఇప్పుడు రవితేజతో సినిమాలు చేయట్లేదు. వాళ్ల కష్టంతోనే వాళ్లు స్టార్ డైరెక్టర్లు అయ్యుండొచ్చు. కానీ వాళ్లకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చింది రవితేజనే కదా. మరి ఆయన్ను ఎందుకు మర్చిపోయారు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు వారి వెంట పడుతున్నారు. కానీ రవితేజతో మరో సినిమా చేయలేదు వీరు. రవితేజ అడగట్లేదా.. లేదంటే వీరు పట్టించుకోవట్లేదా అనేది తెలియదు. ఒక్క గోపీచంద్ మలినేని మాత్రమే రవితేజతో ఆ మధ్య క్రాక్ మూవీ చేసి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి రవితేజతో సినిమాలు చేసి హిట్లు ఇవ్వాలని కోరుతున్నారు ఆయన ఫ్యాన్స్.
Read Also : Samantha : స్టార్ డైరెక్టర్ తో సమంత పవర్ ఫుల్ మూవీ..?