The Warrior Teaser: వీలైతే మారిపోండి.. లేదా పారిపోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని, ఎన్. లింగుస్వామి కాంబోలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కెరీర్‌లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించిన రామ్.. ఈ టీజర్‌లో ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్ సూపర్బ్‌గా ఉన్నాయి.
గత కొంతకాలం నుంచి మనం మిస్ అవుతోన్న ఎనర్జిటిక్ రామ్ ఇందులో కనిపించాడని చెప్పొచ్చు. డైలాగులు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా.. ‘డియర్ గ్యాంగ్‌స్టర్స్, వీలైతే మారిపోండి లేదా పారిపోండి, ఇదే నేను మీకిస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ గ్రేస్‌తో రామ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. హీరోయిన్ కృతి శెట్టి రెండు, మూడు ఫ్రేమ్స్‌లో అందంగా తళుక్కున మెరిసింది. ఇక విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి రగ్డ్ లుక్‌లో అదరహో అనిపించాడు. హీరో – విలన్ కాంబోగా రామ్ – ఆది జోడీ బాగానే కుదిరిందని చెప్పుకోవచ్చు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
కాగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నదియా, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జులై 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!