Ram Pothineni: రామ్ న్యూ లుక్.. అదిరిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు మంచి హిట్ వచ్చింది లేదు. ఇక దీంతో ఈసారి.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అసలు ఐతే ఈపాటికి స్కంద రిలీజ్ కావాల్సి ఉండగా.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఆ సినిమా ప్లేస్ లో స్కంద వచ్చి చేరింది. సెప్టెంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర్లో ఉన్నా కూడా ఆమెకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో .. ఎట్టకేలకు రామ్ .. ప్రమోషన్స్ షురూ చేశాడు.
Viral Video: ఓరి నాయనో.. ఏంది తల్లి ఈ విన్యాసాలు.. గుండె ఆగిపోయేలా ఉంది..
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ఇక రామ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురికి నచ్చినది .. నాకసలే ఇక నచ్చదు అన్నట్లు ఉంటాడు. ఏ ఈవెంట్ కు వచ్చినా తన స్టైల్ తో అందరి కళ్లు తనవైపు తిరిగేలా చేస్తాడు. ఇక ఎయిర్ పోర్ట్ లుక్ తో కూడా వారం ఎన్నో సార్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. షర్ట్ పై ఇంకో షర్ట్.. పై బటన్ కిందకు పెట్టడం.. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ కనిపించాడు. అవన్నీ కూడా రామ్ కు కొత్త లుక్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక తాజాగా స్కంద ప్రమోషన్స్ లో కూడా రామ్.. తనదైన స్టైల్ తో అదరగొట్టాడు. ఏ హీరో అయినా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అంటే సినిమా లుక్ ను బట్టి రెడీ అవుతారు.. కానీ, రామ్ మాత్రం ఎంచక్కా.. ఇంట్లో ఉన్నట్లు షార్ట్స్ వేసుకొని ఇంటర్వ్యూకు వచ్చాడు. లైట్ గ్రీన్ కలర్ షర్ట్.. వైట్ కలర్ షార్ట్స్.. వైట్ షూస్ .. గుబురు గడ్డం.. బ్లాక్ గాగుల్స్ తో రామ్ న్యూ లుక్ వేరే లెవెల్ ఉందని చెప్పాలి. ఎంతైనా ఇస్మార్ట్ శంకర్ కాబట్టి.. ఏది వేసినా కుర్రాడు కేక పుట్టిస్తాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి స్కందతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
The Electrifying Duo, Ustaad @ramsayz & Energetic @sreeleela14 special interview with @itsSumaKanakala garu ❤️🔥💥
Stay Tuned!#RAPOMass #SkandaOnSep28#BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/o6YrCCW6od
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 22, 2023
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!