Kumari Srimathi Trailer: ఆస్తి కోసం బార్ ఓపెన్ చేసిన నిత్యామీనన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumari Srimathi Trailer: ఎటువంటి గ్లామర్ ఒలకబోయకుండా .. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించే హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. అందుకే ఆమెను చాలామంది సౌందర్యతో పోలుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా.. మరో కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిత్యామీనన్ హీరోయిన్ గా గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో తిరువీర్, నిరుపమ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఙట్రైలెర్ ను బట్టి .. ఇదొక అమ్మాయి కథ అని తెలుస్తోంది. కుమారి శ్రీమతి గా నిత్యా కనిపిస్తుంది.
The Kerala Story: ఆస్కార్ బరిలో వివాదాస్పద సినిమా.. ?
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
శ్రీమతి కి 30 ఏళ్లు. ఒకపక్క పెళ్లి చేయాలనిఆమె తల్లి .. ఇంకోపక్క అక్క పెళ్లి చేసుకుంటే తన లైన్ క్లియర్ అవుతుందనుకొనే చెల్లి. ఆమెకోసమే కాచుకొని కూర్చునే బావ ఉంటారు. కానీ, శ్రీమతికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన తాత సంపాదించిన ఒక పెద్ద బంగ్లాను దక్కించుకోవడానికి శ్రీమతి కష్టపడుతూ ఉంటుంది. ఆమె తండ్రి చనిపోవడంతో బాబాయ్ ఆస్తి మొత్తాన్ని కాజేసి.. శ్రీమతి కుటుంబాన్ని బయటకు గెంటేస్తాడు. ఎలాగైనా కోర్టులో బాబాయ్ మీద నెగ్గి.. తాత ఆస్తిని చేజిక్కించుకోవాలని, ఆ ఆస్థి వచ్చాకే పెళ్లి చేసుకుంటాను అని శపథం చేస్తోంది శ్రీమతి. ఇక కోర్టు లో ఆ ఇల్లు మార్కెట్ లో ఎంత రేటు ఉందో అంత డబ్బు బాబాయ్ కు చెల్లించి ఇల్లు తీసుకోవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంతో .. రూ. 38 లక్షలు కట్టడానికి ఒప్పుకుంటుంది. నెలకు రూ. 13 వేలు మాత్రమే సంపాదించే శ్రీమతి అంత డబ్బు చెల్లించడానికి.. ఊర్లో ఒక బార్ ఓపెన్ చేయాలనుకుంటుంది. అయితే ఆ ఊర్లో బార్ ఓపెన్ చేయడానికి మహిళలు ససేమిరా ఒప్పుకోరు. అంతేకాకుండా బార్ పర్మిషన్స్ అంటూ.. శ్రీమతి ఆ బార్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చివరికి ఆమె అనుకున్నది సాధించిందా .. కుమారి శ్రీమతి.. శ్రీమతిగా మారిందా.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. నిత్యాకు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. ఇక ఇందులో ఆమె మిడిల్ క్లాస్ యువతీగా ఎంతో అందంగా కనిపించింది. ట్రైలర్ తో సిరీస్ పై అంచనాలు పెరిగాయి. సెప్టెంబ్ర్ 28 న ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో నిత్యా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?