Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మూడు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 11 ఏళ్ల తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది. దీంతో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక మూడు రోజులు హాస్పిటల్ ల్లోనే చికిత్స తీసుకుంటున్న ఉపాసన కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యింది. భార్యను కూతురును ఇంటికి తీసుకువెళ్ళడానికి చరణ్ హాస్పిటల్ కు చేరుకొని.. అక్కడ మీడియా వారితో ముచ్చటించాడు. ఇక పాప పుట్టిన తరువాత చరణ్ మొదటిసారి మీడియా ముందుకు రావడంతో జర్నలిస్టులు అందరు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇకపోతే చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ” మీడియా మిత్రులకు, అభిమానులకు, మా వెల్ విషర్స్ కు థాంక్స్. పాప.. 20 వ తేదీ ఉదయం జన్మించింది. ఈరోజే పాపను, ఉపాసనను డిశ్చార్జ్ చేశారు. ముందుగా అపోలో వైద్యులకు, స్టాఫ్ కు చాలా థాంక్స్. ఉపాసనను, పాపను బాగా చూసుకున్నారు. ఇక అభిమానులు.. వారు చేసిన పూజలు.. పాప కోసం వారు ఎదురుచూసిన తీరు.. థాంక్స్. ఇంతకన్నా అభిమానులను ఏం అడుగగలుగుతాను. అభిమానుల బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పాపకు ఉంటాయి. ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలియదు.. 21 రోజుల్లో పాప పేరు పెట్టాలని చూస్తున్నాం. ఇప్పటికే ఒక పేరు అనుకున్నాం. నేనే స్వయంగా పాప పేరు చెప్తాను ఆరోజు. ఫస్ట్ టైమ్ పాపను ఎత్తుకున్నప్పుడు ప్రతి తండ్రి ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యాను. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్క్రిప్ట్ అనుకుంటారు” అని చెప్పుకొచ్చాడు. ఇక పాప ఎవరి పోలికలతో ఉంది మీదా.. లేదా అని ప్రశ్న ముగించకముందే.. ” ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది” అని చెప్పి చరణ్ గర్వంగా ఫీల్ అవ్వడం ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.