మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “ఆర్సీ 15”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించిన టీం నవంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.…