బుల్లితెర ప్రేక్షకులు అత్యంత్య ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరులు” నిన్న ప్రసారమైంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోతో హోస్ట్‌గా చిన్న విరామం తర్వాత మళ్లీ టెలివిజన్ తెరపైకి వచ్చారు. రామ్ చరణ్ ఈ షోలో మొదటి ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షణీయమైన దుస్తుల్లో స్టైలిష్‌గా, స్మాషింగ్‌గా కనిపించాడు. సెన్సేషనల్ స్టార్ హాట్ సీట్ తీసుకొని పాపులర్ రియాలిటీ షోను ప్రారంభించారు. రామ్ చరణ్ ఆట సమయంలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో తన సంబంధాన్ని పంచుకున్నారు.
Read Also : వర్మ డ్యాన్సింగ్ స్కిల్స్ కి నెటిజన్స్ ఫిదా
“చిన్నప్పటి నుంచి ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను నాకు తండ్రి లాంటి వ్యక్తి. అయితే ఆయనను బాబాయ్ అని పిలవాలా ? అన్నా అని పిలవాలా ? అనేది అర్థం కాదు. ఆయన నాకు సోదరుడి లాంటి వ్యక్తి. మా సంబంధాన్ని మాటల్లో చెప్పలేము. ఒకవేళ మా మధ్య రిలేషన్ గురించి బయటకు చెప్తే దిష్టి తగులుతుందేమో ! ” అని అన్నాడు రామ్ చరణ్. ఇంకా ఆయన ఈ షోలో చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య చిరంజీవి, ఆచార్య, రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా వంటి విషయాలు చర్చకు వచ్చాయి.