Ram Charan: పక్కవారికి, తమ అభిమానులకు హెల్ప్ చేయడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక తండ్రి చిరంజీవి చూపిన మార్గంలోనే కొడుకు చరణ్ కూడా నడుస్తున్నాడు. తాజాగా చరణ్ తన ఉదారతను చూపించాడు. తన ఫ్యాన్ కోసం కొంత సమయాన్ని వెచ్చించాడు. వివరాల్లోకి వెళితే.. మణి కుశాల్ రామ్ చరణ్ కు వీరాభిమాని. అతడి వయస్సు తొమ్మిదేళ్లు. అతడు ఎన్నో రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. తాను చనిపోతానని తెలియడంతో అతడి చివరి కోరిక ఏంటని తల్లిదండ్రులు అడుగగా తన అభిమాన హీరో రామ్ చరణ్ ను కలవాలని కోరాడు. దీంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు తెలిపారు. వారు కూడా బాలుడు చివరి కోరికను తీర్చడానికి ముందుకొచ్చారు. వెంటనే ఈ విషయాన్నీ రామ్ చరణ్ కు చెప్పడం, ఆయన ఒప్పుకోవడం జరిగింది.
హీరోయిన్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నటులు..?
ప్రస్తుతం హైదరాబాద్ లోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బుల్లి ఫ్యాన్ కోరికను రామ్ చరణ్ నెరవేర్చాడు. మణి కుశాల్ ను కలిసి అతడితో కొద్దిసేపు ముచ్చటించాడు. బాబు తల్లిదండ్రులకు దైర్యం చెప్పి తాను ఉన్నానంటూ హామీ ఇచ్చాడు. తన అభిమాన హీరోను చూడగానే మణి కుశాల్ మోములో విరిసిన నవ్వు వర్ణనాతీతం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు బంగారం… సార్.. మా చరణ్ అంటూ ఖైదీలోని కార్తీ డైలాగ్ తో మీమ్స్ రూపంలో పొగిడేస్తున్నారు.