Ram Charan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్. ఇక గత వారం నుంచి మెగా ఇంటి పెళ్లి సందడి నుంచి ఫోటోలు రావడం.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతూనే ఉంది. ఇక నిన్న పెళ్లి అయిపోవడంతో మెగా, అల్లు కుటుంబాలు ఒక్కొక్కరిగా తమ తమ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఇక నిన్న మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటోలు గురించి యెంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. పవన్ ఫోటోలు రాకపోయేసరికి మీమ్స్ కూడా వేసి.. పవన్ ఎక్కడ .. ? అంటూ ట్రెండ్ చేశారు. ఇక గతరాత్రి నుంచి పవన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా సింపుల్ గా పవన్.. ఈ పెళ్ళిలో కనిపించాడు. ఆలివ్ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ తోనే పెళ్లి వేడుకలో కనిపించాడు.
Puri Jagannath: దేవుడా.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన పూరి.. అసలేమైంది.. ?
ఇక తాజాగా పవన్ తో రామ్ చరణ్ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆలివ్ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ పై బ్లాక్ జర్కిన్ వేసుకొని పవన్.. డిజైనర్ డ్రెస్ లో చరణ్.. నవ్వుతూ కనిపించారు. ఇక బాబాయ్ అబ్బాయ్ ను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ పెళ్లి మొత్తం లో ఇది కదా అభిమానులు కోరుకున్న పిక్ అని కొందరు.. ఇది కదా పిక్ ఆఫ్ ది డే అంటే.. అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.