Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగులో తిరుగుతున్నాడు. గత నెల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో సినిమా వేగంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీని తర్వాత ఎలాగూ సుకుమార్ తో సినిమా ఉండబోతోంది. కానీ ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే పెట్టుకున్నాడు చరణ్. ఈ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
Read Also : PSL: పీఎస్ఎల్ ఫ్రాంచైజ్‌లో రోహిత్ శర్మ వాయిస్.. ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. రామ్ చరణ్ సంక్రాంతికి వచ్చి చాలా రోజులు అవుతోంది. తెలుగు సినిమాలకు సంక్రాంతి చాలా పెద్ద సీజన్. యావరేజ్ సినిమాలకు కూడా సంక్రాంతికి భారీగా కలెక్షన్లు వస్తాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఇక వసూళ్లను ఆపడం కష్టమే. అందుకే సంక్రాంతి సీజన్ కు వచ్చి రికార్డులు కొల్లగొట్టాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందంట. పైగా వచ్చే సంక్రాంతికి ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ను లాక్ చేయలేదు. కాబట్టి ముందే తన సినిమా రిలీజ్ డేట్ ను సంక్రాంతికి లాక్ చేసుకుంటే.. వేరే సినిమాలు పోటీకి రాకపోవచ్చు అనుకుంటున్నారంట. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ రోజే ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.